Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నట్లుగా ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ చనిపోయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ సైతం ఈ వార్తలను తోసిపుచ్చలేదు. సుప్రీం కమాండర్‌కు అనుకోని విధంగా ఏదైనా జరిగితే కొత్తగా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే చర్చ జరుగుతున్నది. ఇరాన్ రాజకీయాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ నిపుణులు మాత్రం ఖమేనీ కుమారుడు అతని తర్వాత సుప్రీం లీడర్‌గా వచ్చేందుకు అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. అతను ఎందుకు సుప్రీం లీడర్ కాలేడు..? ఇస్లామిక్ నేత ఖమేనికి ఉత్తరప్రదేశ్‌తో ఉన్న సంబంధాల గురించి ఓసారి తెలుసుకుందాం..!
ఇటీవల 30 మంది ఇరానియన్ నిపుణులతో నిర్వహించిన బీబీసీ పర్షియన్ పోల్‌లో.. అయతుల్లా అలీ ఖమేనీ రెండో తనయుడు మోజ్తబా తన తండ్రి బాధ్యతలను చేపడుతాడని విశ్వసిస్తున్నట్లుగా తేలింది. కానీ, ఇరాన్ సొంత వ్యవస్థ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వంశపారంపర్య వారసత్వం ద్వారా అధికారాన్ని బదిలీ చేయాలన్న ఆలోచన ‘ఇస్లాం వ్యతిరేకంగా’ పేర్కొన్నారు. షాను తొలగించిన అయతుల్లా రుహోల్లా ఖమేనీ.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది రాచరికం కంటే మెరుగైంది ఏమీ కాదన్నారు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు ప్రసంగాలు, ఇతర రచనలను సేకరించిన 21-సంపుటాల సముదాయం సహిఫెయే ఇమామ్ ఖమేనీలో నమోదయ్యాయి. 1989లో ఖమేనీ తర్వాత సుప్రీం నాయకుడిగా మారిన ఖమేనీ.. వంశపారంపర్య పాలన ఇస్లామిక్ వ్యవస్థకు తగదని అన్నారు. అది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి.. ఖమేనీ నేపథ్యాన్ని.. ఉత్తరప్రదేశ్ ఉన్న సంబంధాలను పరిశీలిద్దాం..!
ఇరాన్లో అయతుల్లా రుహోల్లా ఖమేని చిత్రం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇరాన్ కరెన్సీ నోట్లు.. తరగతి గదులు.. ప్రభుత్వ భవనాల్లో ఆయన చిత్రం కనిపిస్తుంది. ఆయన 1979 ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించారు. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న షాను పదవి నుంచి తొలగించారు. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 1983 నివేదికలో.. ఖమేనీ ప్రభావం లేకుండా ఈ విప్లవం సాధ్యమయ్యేది కాదని పేర్కొంది. మతం-రాజకీయాలు విడదీయరానివని ఆయన భావించేవారు. ఇస్లాం అంటే రాజకీయాలని ఆయన ఓ సారి వ్యాఖ్యానించారు. ఆయనపై షియా విశ్వాసాల లోతైన ప్రభావం కనిపిస్తుంది. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావికి భారత్‌తో సంబంధాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ పట్టణం ఆయన స్వస్థలం.
1979 ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన ఖమేనీ తన తాత అహ్మద్ ఆధ్యాత్మిక మార్గం నుంచే ప్రేరణ పొందారు. అహ్మద్ భారతదేశం నుంచి ఇరాన్‌కు వెళ్లారు. ఖమేనీ ఆ తర్వాత ఇరాన్ దేశ మొదటి సుప్రీం నాయకుడు అయ్యాడు. ఇరాన్‌ను దైవపరిపాలనా రాజ్యంగా మార్చాడు. అహ్మద్ తన భారతీయ మూలాలను ప్రతిబింబించడానికి ‘హిందీ’ అనే పేరును తన పేరులో కలిపి పెట్టుకున్నాడు. అహ్మద్ 1830లో బారాబంకీని వదిలి వెళ్లాడు. ఆయన తండ్రి దిన్ అలీ షా 1700లో మధ్య ఇరాన్ నుంచి భారతదేశానికి ప్రయాణించాడు. 1800 ప్రాంతంలో జన్మించిన అహ్మద్.. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ నియంత్రణ పెరుగుతున్న సమయంలో లక్నో నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకీ సమీపంలోని కింటూరు గ్రామంలో పెరిగాడు. ఇస్లాంకు పునరుజ్జీవనం అవసరమని.. ముస్లింలు సమాజంలో తమ స్థానాన్ని తిరిగి పొందాలని నమ్మిన ముస్లిం ప్రముఖుల్లో ఒకడు. ఆయన షియా మత గురువు.
అహ్మద్ తాను ఎదగడంతో పాటు ఇతరులకు సహాయపడేలా జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. 1800 ప్రారంభంలో భారతదేశం నుంచి ఇరాక్‌కు బయలుదేరాడు. ఆ సమయంలో పర్షియా పేరుతో పిలువబడ్డాడు. 1830లో నజాఫ్‌లోని అలీ సమాధిని సందర్శించాడు. 1834 నాటికి ఇరానియన్ పట్టణమైన ఖోమిన్కు వెళ్లి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. అక్కడే కుటుంబాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రయాణం తన మతంపై నమ్మకంతో దాన్ని వ్యాప్తి చేయాలనే కోరిక ఉండేది. ఖోమిన్లో ఆయన మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ఒకరు రుహోల్లా ఖోమినీ తండ్రి మోస్తఫా. ఆయన 1902లో జన్మించాడు. అహ్మద్ హిందీ 1869లో తుదిశ్వాస విడిచారు. ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను గుర్తుచేసేలా ‘హిందీ’ అనే పేరును ఉంచుకున్నాడు. ఇప్పటికీ ఇరాన్ అధికారిక డాక్యుమెంట్లలో ఈ పేరే ఉంటుంది. ఆయనను కర్బాలాలో ఖననం చేశారు. ఖమేనీ పుట్టడానికి చాలా కాలం ముందే అహ్మద్ హిందీ మరణించినప్పటికీ.. కుటుంబ విలువలు, విశ్వాసం సుప్రీం లీడర్ ఖమేనీ ద్వారా ఇరాన్ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాయి.