Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి (Karti Chidambaram) ఊరట లభించింది. చైనా వీసా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Chinese visa scam case)లో కార్తీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ (bail) మంజూరు చేసింది. 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పించేందుకు తన సహచరుడి ద్వారా పంజాబ్‌కు చెందిన బెల్ టూల్స్ అనే సంస్థ నుంచి రూ.50 లక్షలు లంచం అందుకున్నట్లు కార్తీ చిదంబరంపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కార్తీ చిదంబరంపై మార్చిలోనే ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రూ.లక్ష విలువైన రెండు వ్యక్తిగత బాండ్లను సమర్పించాలని సూచించింది. ఈ ప్రాసస్ పూర్తి కావడంతో నేడు కార్తీకి బెయిల్ మంజూరైంది. అయితే, ప్రతి వాయిదాకూ కచ్చితంగా హాజరుకావాలని కోర్టు పేర్కొంది. విదేశాల్లో ఉంటే దర్యాప్తు సంస్థ పిలిచిన 48 గంటల్లోపు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read..
Naveen Patnaik | 24 ఏళ్ల పాలనపై సిగ్గుపడాల్సిన అవసరం లేదు.. ఓటమిపై నవీన్ పట్నాయక్ స్పందన
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
Thank you very much Amma!.. ఎన్టీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు