Haryana Elections : జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్తోపాటే హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం హర్యానాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ మాట్లాడుతూ.. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తాము మూడింట రెండొంతుల మెజారిటీతో గెలువబోతున్నామని చెప్పారు.
#WATCH | Haryana to vote on October 1; counting of votes on Oct 4
Haryana Congress chief Udai Bhan says, “We welcome it and Congress is ready. Congress will form the government with a 2/3rd majority…” pic.twitter.com/1UINDqm9f6
— ANI (@ANI) August 16, 2024