చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మే 7 లేదా 8న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం ఇంకా సమకూరలేదు. (Vijay’s TVK) తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
కాగా, తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్ స్థానాల్లో గెలిచిన విజయ్ ఒక దానిని వదులుకోవాల్సి ఉంటుంది. తిరుచి ఈస్ట్‌కు ఆయన రాజీనామా చేస్తే ఈ సంఖ్య 107కు తగ్గుతుంది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను కూడా టీవీకే ఎన్నుకుంటుంది. దీంతో విశ్వాస తీర్మానం సమయంలో స్పీకర్ ఓటు వేయలేరు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో టీవీకే వాస్తవ సంఖ్యా బలం 106కు తగ్గిపోతుంది.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్క్ లేకపోవడంతో కూటమి ఏర్పాటు కోసం టీవీకే ప్రయత్నిస్తున్నది. బుధవారం ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కలిపితే సంఖ్యా బలం 111కు చేరుతుంది. దీంతో 118 మెజారిటీ మార్క్ కోసం ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని పార్టీల మద్దతు కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది.
అయితే టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ బుధవారం ఉదయం ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామిని కలిసినట్లు తెలుస్తున్నది. అలాగే ఏఐఏడీఎంకే నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇలా జరిగితే బీజేపీ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసిన ఏఐఏడీఎంకేలో చీలిక రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:
TVK chief Vijay | టీవీకే చీఫ్ విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ అర్లేకర్
Congress support to Vijay | విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. షరతులు విధింపు
Rajinikanth | డీఎంకే అధినేత స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని భరోసా!