చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని తెలిపింది. అయితే షరతులు విధించింది. (Congress support to Vijay) భారత రాజ్యాంగాన్ని విశ్వసించని మతతత్వ శక్తులను టీవీకే దూరంగా ఉంచితేనే తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. టీవీకేతో ఏర్పడిన తమ కూటమి పెరియార్ సామాజిక న్యాయ ఆదర్శాలకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ ఆదర్శాలకు దృఢమైన నిబద్ధతతో కట్టుబడి ఉంటుందని తెలిపింది. తమిళనాడులో ‘పెరుంతలైవర్’ కామరాజ్ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.
కాగా, రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సముచిత వాటా, ఉమ్మడి బాధ్యత అనే పునాదులపై తమ కూటమి ఏర్పడినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ కూటమి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే పరిమితం కాదని భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని ఒక లేఖలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు బుధవారం చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ చీఫ్ విజయ్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు తమ పూర్తి మద్దతును అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) నిర్ణయించినట్లు ఆయనకు తెలియజేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు లేఖను విజయ్‌కు అందజేశారు.
#WATCH | Tamil Nadu Congress leaders meet TVK chief Vijay at the TVK Headquarters in Chennai.
Tamil Nadu Congress Committee and the Congress Legislative Party (CLP) has decided to extend its full support to the TVK to form the government.
(Source: TVK) pic.twitter.com/pVtWmbcrS7
— ANI (@ANI) May 6, 2026
#WATCH | Tamil Nadu Congress leaders hand over the letter of support to TVK chief Vijay at the TVK Headquarters in Chennai.
Tamil Nadu Congress Committee and the Congress Legislative Party (CLP) has decided to extend its full support to the TVK to form the government.… pic.twitter.com/1Bi3Ik06Ky
— ANI (@ANI) May 6, 2026