Rajinikanth | తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాను స్టాలిన్ వెంటే ఉంటానని, ఆయనకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానని రజనీకాంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం వ్యక్తిగత పలకరింపు కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్‌కు ధైర్యం చెప్పడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
మరోవైపు కాంగ్రెస్, ఇతర లెప్ట్ పార్టీలతో కలిసి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. మే 07న విజయ్ ప్రమాణస్వీకారం ఉండబోతున్నట్లు సమాచారం.