బెంగళూరు: కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ‘పోస్టర్ వార్’ ప్రారంభించింది. తమ ప్రభుత్వ విజయాలు అంటూ బీజేపీ వేసిన పోస్టర్లపై ‘కివి మేలే హూవు (చెవిలో పూలు)’ అని పోస్టర్ అతికించి శనివారం ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్లర్లు దర్శనమిచ్చాయి. హామీల అమలులో బీజేపీ మోసంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు.