రాహుల్ బ్రిటన్ టూర్‌కు పొలిటికల్ క్లియరెన్స్ అవసరం లేదు : కాంగ్రెస్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని ప్రభుత్వం పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని ప్రభుత్వం పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం తోసిపుచ్చింది. బ్రిటన్ లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జెరెమి కార్బిన్‌తో రాహుల్ భేటీ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ తన బ్రిటన్ పర్యటన కోసం పొలిటికల్ క్లియరెన్స్ కోరలేదని సీనియర్ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చుతూ రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఎఫ్సీఆర్ఏ అనుమతి పొందారని, ఆయన పర్య పొలిటికిల్ క్లియరెన్స్ అవసరం లేదని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశం లేవనెత్తుతోందని అన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ విదేశీ పర్యటనకు ఎఫ్సీఆర్ఏ అనుమతి సరిపోతుందని, రాహుల్ గాంధీ పర్యటనకు ఎఫ్సీఆర్ఏ క్లియరెన్స్ లభించిందని చెప్పారు. కేంద్ర మంత్రి లేదా ప్రభుత్వ ఉద్యోగుల విదేశీ పర్యటనలకే పొలిటికల్ క్లియరెన్స్ అవసరమని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ సేవకులు కాదని, వారు ప్రజల సేవకులని స్పష్టం చేశారు. ప్రభుత్వేతర పర్యటనల కోసం వారు ప్రభుత్వానికి జవాబుదారీ కాదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

