న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం తన దేశంలో పోరాడుతున్న వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కడంతో తమ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అందుకు అర్హుడేనని కాంగ్రెస్ ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కూడా దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారని, ఆయన కూడా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కాంగ్రెస్ ఎంపీ రాజ్పుత్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
రాహుల్ ఫొటోతోపాటు మచాడో ఫొటోను ఆయన షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేశారు.