పట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Polls) బిహార్‌లో విపక్ష కూటమి పార్టీల్లో సీట్ల సర్ధుబాటు ప్రక్రియ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ చొరవ చూపింది. జేడీ(యూ), ఆర్జేడీ చెరో 15 స్ధానాల్లో పోటీ చేయాలని, మిగిలిన స్ధానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని బిహార్ కాంగ్రెస్ ప్రతిపాదించింది.
ఒక సీటులో సీపీఐఎంఎల్ పోటీలో నిలుస్తుందని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలూ ఎన్నికల బరిలో కలిసి పోరాడేందుకు అనువైన వెసులుబాటు ఉండాలని బిహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ సింగ్ పేర్కొన్నారు.
జేడీయూ 2019లో బీజేపీతో కలిసి పోటీ చేయగా ప్రస్తుతం ఆ పార్టీతో తమతో కలిసిరావడం విపక్ష కూటమికి కలిసివస్తుందని, వారికి అధిక సంఖ్యలో సిట్టింగ్ ఎంపీలున్నారని సింగ్ అన్నారు. బిహార్‌లో 40 లోక్‌సభ స్ధానాలుండగా, 2019లో వీటిలో 9 స్ధానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఈసారి కూడా భాగస్వామ్య పార్టీలు అధిక సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడిఉందని సింగ్ చెప్పారు.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్‌కు బానిసే.. అతనెవరంటే?