ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రచార సమయం ముగుస్తుందన్న కొద్ది గంటల ముందు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 13 హామీలతో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను సీఎం చెన్నీ అధికారికంగా ప్రకటించారు. అయితే పీసీసీ చీఫ్ సిద్దూ రూపొందించిన పంజాబ్ మోడల్‌ను ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం విశేషం. నిజానికి ఉదయం 11 గంటలకే ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయాల్సి వుంది. అయితే సిద్దూ రూపొందించిన పంజాబ్ మోడల్‌ను ఈ మేనిఫెస్టోలో జత చేసి, ప్రకటించే సరికి సాయంత్రం అయ్యిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక… తాము గనక అధికారంలోకి వస్తే మొది సంతకం లక్ష ఉద్యోగాల ఫైల్‌పైనే అని సీఎం చెన్నీ పునరుద్ఘాటించారు.
ఇక.. ఉచిత గ్యాస్, ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు మరిన్ని హామీలు ఇచ్చారు. మద్యం, ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి యేడాది 8 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అలాగే నిరుపేద మహిళలకు నెలకు 1100 రూపాయలు ఇవ్వడం, ఇక పక్కా లేని గృహాలను ఆరు నెలల్లోగా పక్కా ఇళ్లగా మారుస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక..వృద్ధులపెన్షన్ను3100గాపెంచుతున్నట్లుప్రకటించింది.పప్పు,నూనెతో పాటు మక్క పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, దాని ప్రకారమే కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.