Congress | ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్చేసినా, ఎందుకు కిమ్మనడం లేదని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం బలహీనప్రభుత్వమని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్చేసినా, ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ‘మన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని చైనా దెబ్బతీస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాలపై ఇప్పటికే చైనా పట్టు నిలుపుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఓ గ్రామాన్నే ఏర్పాటు చేసుకుంది. ఇంత జరిగినా మోదీ మాత్రం మాట్లాడటం లేదు. అత్యంత బలహీనమైన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం’ అంటూ రణదీప్ సూర్జేవాలా తీవ్రంగా మండిపడ్డారు.