పుణె, జూలై 7: మహరాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ తాభాడే పట్టణంలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌పై భజరంగ్ దళ్, వీహెచ్‌పీ గ్రూపుల కార్యకర్తల దాడి ఘటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌గా మద్దతుగా నిలిచారు. విద్యార్థినుల బాత్రూమ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయించారని, పాఠశాలలో క్రిస్టియన్ ప్రార్థనలతో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. ప్రిన్సిపాల్‌కు మద్దతుగా శుక్రవారం విద్యార్థులు పాఠశాల బయట శుక్రవారం ఆందోళన చేశారు.
మరమ్మతుల్లో వాష్‌బేసిన్ ఏరియాలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ ఎంతో కృషి చేస్తున్నారని, రాజకీయ ప్రేరేపితం కారణంగా ఆరోపణలు చేస్తున్నారని సుమన్ అద్వానీ అనే పాఠశాల మాజీ అధ్యాపకుడు పేర్కొన్నారు. కార్యకర్తలు బట్టలు చిరిగేలా తీవ్రంగా కొట్టడంతో బాధిత ప్రిన్సిపాల్‌కు గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన అవమానకరమని, మర్యాదస్థులైన హిందువులు ఇలా ప్రవర్తించరని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.