Shashi Tharoor | విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ రద్దు : శశి థరూర్
Shashi Tharoor : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏ అమలును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్షాలు యోచిస్తున్నాయి.
Shashi Tharoor : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏ అమలును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఎన్నికలకు ముందు సీఏఏ నోటిఫికేషన్ జారీపై కాంగ్రెస్, టీఎంసీ, శివసేన (యూబీటీ), ఎస్పీ సహా పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్రం చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని ప్రకటించారు. సీఏఏ చట్టంలో లోటుపాట్లను ప్రస్తావించిన శశి థరూర్ సీఏఏ నైతికంగా, రాజ్యాంగపరంగా సరైంది కాదని స్పష్టం చేశారు.
విభజన ప్రాతిపదికపై ఓ దేశం మతమే తమ దేశ ప్రాతిపదిక అని చెబుతుండగా, మహాత్మ గాంధీ, నెహ్రూ, మౌలానా అజాద్, డాక్టర్ అంబేద్కర్ మన జాతీయతకు మతం ప్రాతిపదిక కాదని చెప్పారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం తమ పోరాటం అందరి కోసమని, మనం తయారుచేసుకున్న రాజ్యాంగం, దేశం ప్రతి ఒక్కరి కోసమని శశి థరూర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే విస్మయం వ్యక్తం చేశారు. పదేండ్ల కిందట ప్రవేశపెట్టిన సీఏఏను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నాలుగు రోజుల ముందు అమలు చేసేందుకు పూనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్‌తో ఏం ఆశిస్తున్నారు..సీఏఏను అనూహ్యంగా అమలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఆశించారని, ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని బీజేపీని ఉద్దేశించి దూబే విమర్శలు గుప్పించారు.
ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు సీఏఏ అమలు ద్వారా దేశంలో అరాచక పరిస్దితులు నెలకొనేలా బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ధరల పెరుగుదల, దేశంలో నిరుద్యోగం వంటి ప్రదాన అంశాలపై బీజేపీ నోరు మెదపదని, వారు ఇచ్చిన హామీల అమలుపై ఆసక్తి చూపరని దూబే మండిపడ్డారు. రామ రాజ్యం అంటే ఏంటో బీజేపీకి తెలుసా అని ప్రశ్నించారు. రాముడు తానిచ్చిన మాట కోసం అరణ్యవాసం చేశారని, కానీ బీజేపీ పాలకులు పార్టీలను చీల్చి ప్రత్యర్దులను జైళ్లలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం సీఏఏను తెరపైకి తెచ్చారని, కానీ ప్రజలకు అన్నీ తెలుసునని అన్నారు. ఇక సీఏఏ నోటిఫికేషన్‌పై ఎస్పీ నేత ఎస్టీ హసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే కేంద్రం సీఏఏను తెరపైకి తీసుకువచ్చిందని దుయ్యబట్టారు.
Read More :
CAA | అందు కోసమే సిఎఎను తీసుకొచ్చారు : కూనంనేని సాంబశివరావు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

