పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో పెంపు అనేది ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలో భాగమైపోయిందని ఎద్దేవా చేశారు. అలాగే గ్యాస్ ధర పెంపు, డీజిల్ ధర పెంపుతో పాటు రైతులను నిస్సహాయులుగా చేయడం దినచర్యలో భాగం చేసుకున్నారని విమర్శించారు. RozSubahKiBaat అంటూ రాహుల్ హ్యాష్ ట్యాగ్ ఇస్తూ ట్వీట్ చేశారు.
పెట్రో ధరల పెంపు, ప్రజల ఖర్చులపై వస్తున్న విషయాలు, నిరుద్యోగ యువతను ఎలా మభ్య పెట్టాలి? ఏ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలి, రైతులను మరింత నిస్సహాయులుగా ఎలా చేయాలి అన్నదే మోదీ దినచర్యగా ఉంటుంది అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.