Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో పంపిణీ చేసే లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వాడుతున్నారని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీ ఆరోపిస్తోందని, ఇది దేశ ప్రజల విశ్వాసాలను బీజేపీ వమ్ము చేయడంగా పరిగణించాలని అన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ, బీజేపీ సర్కార్లో టీడీపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నందున ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని వ్యాఖ్యానించారు. ఈ పాపంలో బీజేపీ పాపం ఉంటే దేశ ప్రజలు ఎన్నటికీ కాషాయ పార్టీని క్షమించరని స్పష్టం చేశారు. కాగా, తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో (TTD EO ) శ్యామలారావు స్పష్టం చేశారు.
ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కల్తీ జరిగినట్టు గుర్తించి సరఫరాదారు నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని పేర్కొన్నారు. శుక్రవారం టీటీడీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై వివరాలను వెల్లడించారు.తిరుమల (Tirumala) ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత, ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు.
Read More :
Tirumala Laddu | తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర మంత్రుల స్పందన.. బాధ్యులను శిక్షించాల్సిందేనంటూ వెల్లడి