Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో 40లక్షల ఓట్లు రహస్యంగా జోడించారని ఆరోపించారు. 2024 లోక్‌సభ, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య ఈ ఓటర్లు ఓడించారన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వరుసగా ఎన్నికల కమిషన్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పలు చోట్ల ఓటర్ల జాబితా ఆధారంగా చేసుకొని ఈసీపై మండిపడుతున్నారు. ఓటర్ల జాబితాలో చేర్చిన లక్షలాది ఓటర్లను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించకుండా ఓట్లను దొంగిలిస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్‌ను దోషిగా పేర్కొంటూ.. ఈసీ విశ్వసనీయత సందేహాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సేకరించిన ఆధారాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ.. బీజేపీ ఓట్లను దొంగిలిస్తుందన్నారు. ఓటర్ల జాబితా అంశంపై ఈసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కొన్ని నెలల్లోనే లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చారని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల సంఖ్య పెరగడం కూడా ఆశ్చర్యకరమైన విషయమన్నారు.
ఓట్ల దొంగతనానికి సంబంధిం సాక్ష్యాలను సేకరించేందుకు ఆరు నెలలు పట్టిందన్నారు. ఈ సందర్భంగా ఈసీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 5గంటల తర్వాత ఓటింగ్ ఎందుకు పెరిగింది ? ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి లన్నారు. ఓట్ల దొంగతనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నలు అడిగిందని, ఇప్పటి వరకు ఒక్క సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా 2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు ‘రిగ్గింగ్’ అయ్యాయని మా అనుమానాలు నిజమయ్యాయన్నారు.