Delhi ordinance | ఢిల్లీ ఆర్డినెన్స్.. పార్లమెంటులో ఆప్‌కు మద్దతివ్వనున్న కాంగ్రెస్!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే బిల్లుకు కాంగ్రెస్ పార్టీ (Congress) మద్దతివ్వనున్నట్లు (Support) తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే బిల్లుకు కాంగ్రెస్ పార్టీ (Congress) మద్దతివ్వనున్నట్లు (Support) తెలుస్తున్నది. పార్టీ అంతర్గత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రాల్లో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల హక్కులను పరిరక్షించడానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ (Jairam Ramesh) అన్నారు. సమాఖ్య నిర్మాణంపై ఎలాంటి దాడి జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలుస్తామని నేరుగా ప్రకటింకచపోయినప్పటికీ.. రాష్ట్రలపై కేంద్రం చేసే దాడులకు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) లోపల, బయట కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపక్షాల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం విధితమే.
కాగా, శనివారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా హస్తం పార్టీ పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తుందని జైరాం రమేశ్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల రాజ్యాంగ హక్కులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

