ఛండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పదేండ్ల పాలనలో బీజేపీ తీవ్ర వ్యతికేతను మూటగట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలోని 90 సీట్లలో 63 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా, బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది. ఇక జేజేపీ 2, ఐఎన్ఎల్డీ, ఇతరులు ఒక్కో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
రోహ్తక్లో మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. జులానా, కైతాలాలో కాంగ్రెస్ నేతలు వినేష్ ఫోగట్, ఆదిత్య సుర్జేవాలా లాడ్లో ఉండగా, సీఎం నయాబ్సింగ్ సైనీ లడ్వాలో, అంబాలా కంటోన్మెంట్లో అనిల్ విజ్ దూసుకెళ్తున్నారు. కాగా, ఈ నెల 5న ఒకే విడుతలో జరిగిన ఎన్నికల్లో 67.09 శాతం పోలింగ్ నమోదయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాల్సి ఉంటుంది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీచేశారు. అయితే కాంగ్రెస్ లీడ్లో ఉండటంతో పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ, పటాకులు పేల్చుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.