Rahul Gandhi : సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత ఈసీ, బీజేపీ కలిసి ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, ఈసీ జుగల్బంధీ కొనసాగుతోందని, పోటీ మొదలుకాకముందే ముగించేశారని రాహుల్ విమర్శించారు.
ఈ అంశంపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘బీజేపీ, ఈసీ కలిసి సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత సీట్ చోరీకి పాల్పడింది. రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి. మీనాక్షి నటరాజన్ అన్ని డాక్యమెంట్లు సమర్పించారు. ఒక్క పెండింగ్ కేసు లేదు. కానీ, బీజేపీకి అనుకూలంగా ఈసీ ఆమె నామినేషన్ తిరస్కరించింది. బీజేపీ మద్దతు ఇచ్చిన పరిమళ్ నత్వాన్జీ తన పేరునే తప్పుగా రాశాడు. అనేక వివరాలు వెల్లడించలేదు. కానీ, ఈసీ అతడికి అన్ని మినహాయింపులు ఇచ్చింది. ఒకే ఎన్నికల సంఘం. ఇద్దరు అభ్యర్థులు. ఒకరి వాదన వినకుండానే వారిని తిరస్కరించారు. ఇంకొకరికి రూల్స్ ఫాలో అవ్వకుండానే విజయాన్నిచ్చింది.
After Vote Chori and Sarkar Chori – the BJP-EC jugalbandi has finished the contest before it has even begun with Seat Chori.
Look at what happened in the recent Rajya Sabha elections.
Congress candidate Meenakshi Natarajan ji submitted every document. No pending cases. The EC…
— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2026
మేం ఎన్నికల సంఘాన్ని కలవాలి అనుకుంటే మా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత మేం కలిస్తే మాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఇలాంటివి ఇంకా చూడొచ్చు. ఎన్నికల్లో గెలవడంకంటే వాటిని తారుమారు చేయడం బీజేపీకి చాలా సులభం” అని రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ను ఈసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.