Rahul Gandhi | సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు.. జ్యుడీషియల్ విచారణ జరిపించాల్సిందే: రాహుల్ గాంధీ
Rahul Gandhi : సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషీయిల్ విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.
Rahul Gandhi : సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో జరిగిన తప్పులపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులకు తప్పుడు మార్కులు రావడం సంచలనం కలిగించింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషీయిల్ విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.
సీబీఎస్ఈ ఫలితాల్లో జరిగిన తప్పులు, అవకతవకలపై దేశంలోని పిల్లలు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని రాహుల్ అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి జవాబుదారీ తనం లేదని విమర్శించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషియల్ విచారణ జరిపించడంతోపాటు వేగంగా విచారణ పూర్తయ్యేందుకు ఒక సిట్ ఏర్పాటు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల్ని మూల్యాంకనం చేసిన ‘సీవోఈఎంపీటీ’ సంస్థపై కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. గతంలొ ఈ సంస్థ తెలంగాణలో గ్లోబ్ ఎరేనా పేరుతో పరీక్షల్ని మూల్యాంకనం చేసింది.
CBSE परीक्षा परिणाम में भयंकर हेर-फेर हो गई जिससे देश के लाखों बच्चे और उनके माता-पिता सदमे में हैं।
और मोदी जी? हमेशा की तरह – न जवाब, न ज़िम्मेदारी, न शर्म।
जिस कंपनी COEMPT को यह ज़िम्मेदारी मिली, वह पहले Globarena के नाम से तेलंगाना में 2019 में यही कारनामे कर चुकी है।
नाम… pic.twitter.com/iZG8bvUXPJ
— Rahul Gandhi (@RahulGandhi) May 27, 2026
అప్పట్లో తెలంగాణలో 2019 ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై కూడా వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థ ‘సీవోఈఎంపీటీ’ పేరుతో కొనసాగుతోంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. సంస్థ పేరు మారింది కానీ, వారి ఉద్దేశాలు, స్వభావం మాత్రం మారలేదని విమర్శించారు. గతంలోనే వివాదాలు ఉన్న సంస్థకు మళ్లీ జవాబు పత్రాల మూల్యాంకనం చేసే అవకాశం ఎలా కల్పించారు అని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏవైనా నియమ, నిబంధనలు ఉల్లంఘించారా అని ప్రశ్నించారు.
ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించే ముందు సరైన తనిఖీ నిర్వహించారా అని నిలదీశారు. సీబీఎస్ఈ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వాన్ని, సంస్థను రాహుల్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘మీ శ్రమను, మీ భవిష్యత్‌ను ఇతరులు ఎవరూ దోచుకోవడానికి వీల్లేదు’ అంటూ రాహుల్ స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

