Congress Whip : పార్టీ ఎంపీలు ఎవరూ రేపు గైర్హాజరు కావద్దని అందరూ కచ్చితంగా లోక్‌సభకు రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) విప్ (Whip) జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవరకు సభ్యులందరూ అందుబాటులో ఉండాలని ఆ మూడు లైన్ల విప్లో పేర్కొంది.
కాగా, రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా అయితే అధికార కూటమికి చెందిన ఎంపీని ఏకగ్రీవంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. అయితే ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి సీనియర్ సభ్యుడు కె సురేష్‌ను పోటీకి దింపింది. దాంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రేపు స్పీకర్ ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. ఓటింగ్ సందర్భంగా సభ్యులందరూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అధికార కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లానే మళ్లీ బరిలో దింపింది. సభలో అధికార కూటమికి 293, ప్రతిపక్ష కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది.