న్యూఢిల్లీ: అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాలని డిమాండ్ చేశాయి.
అయితే మహిళా బిల్లులో వెనుకబడిన తరగతులు, ఎస్సీ వర్గాలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. కాగా, ఇటీవల జమ్ముకశ్మీర్లో అమరులైన జవాన్లకు సమావేశంలో నివాళులర్పించారు.