న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా.. తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ(PM Modi) రియాక్ట్ అయ్యారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ స్పందించారు. అంబేద్కర్‌తో లింకున్న అయిదు ప్రాంతాలను తమ ప్రభుత్వం డెవలప్ చేస్తోందన్నారు. చైత్య భూమి అభివృద్ధి అంశం కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ అంశాన్ని తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. అక్కడికి వెళ్లి ప్రార్థన చేసినట్లు మోదీ చెప్పారు. ఢిల్లీలోని అలీపూర్ రోడ్డులో అంబేద్కర్ తన చివరి రోజుల్ని గడిపారని, ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు. లండన్‌లో ఆయన నివసించిన ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్‌కు ఇచ్చే గౌరవం, మర్యాదలో లోటు లేదన్నారు.
If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!
The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…
— Narendra Modi (@narendramodi) December 18, 2024
అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోదీ చెప్పారు. అంబేద్కర్ విజిన్ను పూర్తి చేసేందుకు గత దశాబ్ధ కాలం నుంచి తమ నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి తొలగించామన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల్ యోజన లాంటి తమ పథకాలన్నీ పేద, అణగారిన ప్రజల జీవితాలను మార్చినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని, ఆ పార్టీ అబద్దాలతో అంబేద్కర్‌ను అవమానిస్తోందని, వాళ్లు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. దశాబ్ధాలుగా ఓ పార్టీ, ఓ కుటుంబం.. అన్ని రకాలుగా అంబేద్కర్ వారసత్వాన్ని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను నిర్వీర్యం చేసిందని ప్రధాని తన ట్వీట్లో విమర్శించారు.
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ ఎంపిక నేపథ్యంలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అంబేద్కర్ పేరును పదేపదే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, ఆ పార్టీలకు అదో ఫ్యాషన్ అయినట్లు అమిత్ షా తన రాజ్యసభ ప్రసంగంలో మంగళవారం పేర్కొన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడిని ప్రార్థిస్తే, వాళ్లు స్వర్గానికి వెళ్లేవారు అని షా తెలిపారు. దీన్ని విపక్షాలు తప్పుపట్టాయి. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.