బెంగుళూరు: కర్నాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య ఇవాళ 2023-24 సంవత్సరానికి చెందిన బడ్జెట్(Budget)ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సిద్దరామయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది 14వసారి. మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్లో తయారీ అయ్యే విదేశీ మద్యంపై రేట్లను పెంచనున్నట్లు తెలిపారు. 18 రకాల స్లాబులపై ఆ రేటును పెంచుతున్నట్లు చెప్పారు. బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని 175 నుంచి 185 శాతానికి పెంచారు.
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ 3.35 లక్షల కోట్లు ఉంటుందన్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ చేసిన అయిదు వాగ్దానాల కోసం సుమారు 52 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దీని వల్ల 1.3 కోట్ల మంది లబ్ధి పొందనున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు 10 కిలోల ఉచిత బియ్యం, మహిళలకు రూ.2వేలు, నిరుద్యోగ భృతి 3వేలు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.