బెంగళూరు, నవంబర్ 6: ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతలోనే మాట మార్చారు. సీఎంను మార్చాలా? వద్దా? అనేదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని అన్నారు. మరోవైపు, రాబోవు రోజుల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతారని సిద్ధరామయ్య పేర్కొన్నారు.