చండీగఢ్: హర్యానా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం 10 మేయర్ స్థానాలకు ఎన్నికలు జరుగగా, తొమ్మిదింటిలో బీజేపీ విజయం సాధించింది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవశం చేసుకున్నారు. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవ లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం పొందడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి నిరాశ ఎదురైంది. ముఖాముఖీ పోటీ జరిగినప్పటికీ గట్టి పోటీ కూడా ఇవ్వలేక పోయింది. కాంగ్రెస్ మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడాకు గట్టి పట్టున్న రోహతక్‌తో పాటు సోనిపట్‌లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది.