న్యూఢిల్లీ: అతనో మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇంటి ముందు పెద్దసంఖ్యలో హోర్డింగ్లు, పోస్టర్లు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. చిర్రెత్తుకొచ్చిన ఆయన వారిపై భౌతిక దాడికి దిగాడు. వారిని మోకాళ్ల వరకు వంగి చెవులు పట్టుకునేలా చేశాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ ఢిల్లీలోని ఓఖ్లాలో నివాసం ఉంటున్నాడు. అతని ఇంటివద్ద ఆయనకు సంబంధించిన హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC)కు చెందిన సిబ్బంది శుక్రవారం వాటిని తొలగించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వారిని అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా తన పోస్టలు ఎందుకు తొలగించారని వారిపై దాడికి దిగాడు. లాఠీతో కొట్టి, దుర్భాషలాడాడు. మోకాళ్లపై వంగి చెవులు పట్టుకోవాలని చెప్పాడు. అయితే ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, వారు మున్సిపల్ సిబ్బంది అనే విషయం తనకు తెలియదని ఆసిఫ్ ఖాన్ అన్నారు. ఇతర పార్టీల బ్యానర్లను కాంగ్రెస్ పార్టీవే ఎందుకు తొలగించారని ప్రశ్నించానని చెప్పారు.