న్యూఢిల్లీ : పాత పార్లమెంట్ భవనం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దివంగత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ప్రస్తావించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ చారిత్రక ప్రసంగాన్ని గుర్తుచేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఖర్గే పేర్కొన్నారు.
ప్రపంచం నిద్రిస్తున్న వేళ భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందని పండిట్ నెహ్రూ పార్లమెంట్ భవనంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ సోమవారం తన ప్రసంగంలో గుర్తుచేశారని ఖర్గే ప్రస్తావించారు. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తొలి డిప్యూటీ పీఎం సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చరిత్రను కూడా ఖర్గే గుర్తుచేశారు.
ఇక ప్రధాని మోదీ పండిట్ నెహ్రూ పార్లమెంట్ ప్రసంగంతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి..పోతుంటాయి కానీ దేశం ముందుకు సాగుతూనే ఉంటుందని వాజ్పేయి పార్లమెంట్లో అన్నారని చెప్పుకొచ్చారు. ఇక మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం ముగిసిన వెంటనే సభ్యులంతా నూతన పార్లమెంట్ భవనంలో కొలువుతీరారు.
Read More :
Photo Session | పార్లమెంట్ భవనం వద్ద ఎంపీల ఫొటో సెషన్