న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. అయితే, సోనియాగాంధీ ఈ నెల 2న కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే.
అయితే, ఆమె నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కొవిడ్ బారినపడడంతో మరింత సమయం కావాలని కోరారు. అయితే, ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని శుక్రవారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో రాహుల్ గాంధీకి సైతం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే.