భోపాల్: తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న నామ్డియో దాస్ త్యాగి కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో త్యాగికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్-ఇచ్చాపూర్ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కంప్యూటర్ బాబాగా ( Computer baba ) పిలువబడే త్యాగి ఖంద్వా ఉపఎన్నికల కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కాగా, ఈ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉన్నదని కంప్యూటర్ బాబా ఆరోపిస్తున్నారు. తనను హత్య చేయడానికే తన కారును లారీతో గుద్దించారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కంప్యూటర్ బాబాకు గతంలో కమల్నాథ్ సర్కారు రివర్ కంజర్వేషన్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్రమంత్రి హోదా కట్టబెట్టింది. అంతకుముందు బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకు మంత్రి హోదాను అప్పగించింది.
Computer Baba had a narrow escape after his car collided with a truck, he received minor injuries in the accident. He was on his way to attend former chief minister Kamal Nath’s rally ahead of Khandwa bypolls @ndtv @ndtvindia pic.twitter.com/ZfnvUGcpgf
— Anurag Dwary (@Anurag_Dwary) October 18, 2021