న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్ష మూడో ఎడిషన్ ఏడు రోజుల్లో పూర్తవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం వెల్లడించింది. అన్ని పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడం జరుగుతుందని, స్కోర్ల నార్మలైజేషన్ ఉండదని పేర్కొన్నది.
15 సబ్జెక్టులకు ఆఫ్‌లైన్‌లో(పెన్ను-పేపర్ విధానం)పరీక్ష ఉంటుందని, మిగతా 48 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) పరీక్ష ఉంటుందని తెలిపింది. మే 15 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహిస్తామని ఏన్టీఏ అంతకుముందు ప్రకటించగా.. ఇప్పుడు మే 24 నాటికే పరీక్ష పూర్తయ్యే అవకాశం ఉన్నది.