న్యూఢిల్లీ, జూలై 18: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ధరలను నియంత్రించాల్సిన కేంద్రం.. నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రజలను మభ్యపెట్టే చర్యలకు దిగింది.
రోజువారీగా అంతగా ఉపయోగించని శనగపప్పును రాయితీపై అమ్మడాన్ని సోమవారం నుంచి ప్రారంభించింది. ప్రజలు అధికంగా వాడే కందిపప్పు, మినపప్పు వంటి ధరలను నియంత్రించకుండా.. శనగపప్పుపై రాయితీ పేరుతో కేంద్రం బురిడీ కొట్టించాలని చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.