న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశ గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించడమే కొలీజియం లక్ష్యమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మంగళవారం సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ జడ్జీల వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు అనేది మహారాష్ట్రకో, ఢిల్లీకో ఒక ప్రాంతానికి పరిమితమైన న్యాయస్థానం కాదని, ఇది భారత్‌కు చెందిన అత్యున్నత న్యాయస్థానమని, భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించడం దీని లక్ష్యమని అన్నారు. ఇది బహువాణిని విన్పించదని అన్నారు. ఒక జడ్జీ బెంగాల్‌కు, మరో జడ్జీ బీహార్‌కు చెందిన వారైనప్పటికీ వారిద్దరూ కలిసి హర్యానాకు సంబ ంధించిన కేసుపై తీర్పు చెబుతారని, అదే మన దేశ న్యాయస్థానం గొప్పతనమన్నారు. పదవీ విరమణ చేస్తున్న జడ్జీలు భూయాన్, భట్టిలు నిస్సందేహంగా తమ సేవలో సుప్రీం గౌరవాన్ని ఇనుమడింపజేశారని ఆయన ప్రశంసించారు.