Cough Syrup | మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దాదాపు పక్షం రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. దగ్గు సిరప్తాగడం వల్లే చిన్నారులు మృతి చెందడం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్డ్రిఫ్ సిరఫ్ అమ్మకాలను మధ్యప్రదేశ్ వ్యాప్తంగా నిషేధించింది. అలాగే, సిరప్ తయారీ సంస్థ ఇతర ఉత్పత్తులను సైతం నిషేధించేందుకు చర్యలకు ఉపక్రమించిది. చింద్వారాలో కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయవడం చాలా విషాదకరమని సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధించినట్లు తెలిపారు. సిరప్ తయారు చేసిన కంపెనీ ఇతర ఉత్పత్తుల అమ్మకాలను సైతం నిషేధించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
సిరప్ తయారీ కర్మాగారం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయంలో దర్యాప్తు చేయాలని తమిళనాడు సర్కారును కోరింది. ఇందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి ఇవాళ ఉదయం అందింది. నివేదిక ఆధారంగా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. పిల్లల మృతి వార్త వెలుగులోకి వచ్చాక ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. చింద్వారాలోని పరాసియా బ్లాక్‌లో దాదాపు 15రోజుల్లో తొమ్మిది మంది పిల్లలు కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు చికిత్స తీసుకుంటున్నారు. ఆ సిరప్‌లో నాన్-ఫార్మాకోపోయియా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్‌ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.
ఈ డ్రగ్ కిడ్నీలకు హాని కలిగించే విషపూరిత పదార్థాలైన డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమైనట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నివేదిక తర్వాత తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కోల్ట్రిఫ్ సిరప్ అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో స్టాక్‌ను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి ఉత్పత్తిని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తయారీ లైసెన్స్‌ను రద్దుకు షోకాజ్ నోటీస్ పంపారు. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. తమిళనాడు ఎఫ్‌డీఏ తమిళనాడులోని కాంచీపురంలోని శ్రీసన్ ఫార్మా నుంచి కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ నమూనాలను సేకరించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నమూనాల్లో డీఈజీ స్థాయి అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది.
छिंदवाड़ा में Coldrif सिरप के कारण हुई बच्चों की मृत्यु अत्यंत दुखद है। इस सिरप की बिक्री को पूरे मध्यप्रदेश में बैन कर दिया है। सिरप को बनाने वाली कंपनी के अन्य प्रोडक्ट की बिक्री पर भी बैन लगाया जा रहा है।
सिरप बनाने वाली फैक्ट्री कांचीपुरम में है, इसलिए घटना के संज्ञान में…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) October 4, 2025