గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 23:48:19

కొబ్బరి నూనె, కర్పూరం కలిపి వాడడం వల్ల ప్రయోజనాలు

కొబ్బరి నూనె, కర్పూరం కలిపి వాడడం వల్ల ప్రయోజనాలు

హైదరాబాద్: కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాం. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల చర్మం, జుట్టుకి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి కాచి చల్లార్చి ఈ నూనెను అనేక విధాలుగా వాడవచ్చు. చర్మంపై అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి ఆ ప్రదేశంలో రాసుకోండి. ఇలా రెండు మూడు రోజులు చేశారంటే ఆ సమస్య తొలగిపోయినట్లే. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కర్పూరం పొడి వేసి మచ్చలపై మసాజ్ చేయండి. దీనివల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయి. చర్మంపై మొటిమలు మీ ముఖాన్ని పాడు చేస్తాయి. కొబ్బరి నూనె, కర్పూరం కలిపిన తైలాన్ని మొటిమలపై రాస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ నూనె చుండ్రు సమస్యను చిటికె లో పరిష్కరిస్తుంది. 


logo