అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ (Polling)శాతం గంట గంటకు పెరుగుతుంది . ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒకటి వరకు 40.26 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తొలి మూడు గంటలు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ ఉదయం11 గంటల తరువాత పుంజుకుంది.
ఉదయం 11 గంటలకు ఏపీలో 23.10 శాతం పోలింగ్ జరుగగా మరో రెండు గంటల్లో 40.26 శాతానికి పెరిగింది. అనేక చోట్ల మహిళలు(Womens), వృద్ధులు (Oldge People) భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించు కునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మచిలిపట్నం 44.50, విజయవాడ 39.69, గుంటూరు 40.12, నరసరావుపేట 40.53, బాపట్లలో 44.65, ఒంగోలులో 42.37, నెల్లూరులో 42.40. తిరుపతిలో 38.51, చిత్తూరులో 44.65, రాజంపేటలో 40.22 శాతం పోలింగ్ నమోదు అయ్యింది .