న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ(CBSE Class 12) తరగతి ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఆ పరీక్షల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాసయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతిలో 87.98 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 87.33 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది 91.52 శాతం మంది అమ్మాయిలు పరీక్షలను క్లియర్ చేశారు. బాయ్స్ పర్సంటేజీ కన్నా అమ్మాయిలు 6.40 పర్సంటేజీ అదనంగా పాసయ్యారు. సుమారు 24 వేల మంది విద్యార్తులు ఈ పరీక్షల్లో 95 శాతం కన్నా ఎక్కువ మార్కులను సంపాదించారు. ఇక లక్షా 16 వేల మంది విద్యార్థులు 90 శాతం మార్కులను సాధించారు. కంపార్ట్మెంట్ లో 1.22 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ఈసారి 16.21 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు.