న్యూఢిల్లీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren)కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భూ కుంభకోణంతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున ప్రచారం పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోరెన్ అభ్యర్థన పెట్టుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో తనకు కూడా బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సోరెన్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అరునబ్ చౌదరీలు వాదించారు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ మే 17వ తేదీన ఉంటుందని కోర్టు పేర్కొన్నది. మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసేందుకు నిరాకరించింది. సీఎంగా ఉన్న సోరెన్ .. రికార్డులను మార్చివేసి.. అక్రమ రీతిలో ఖరీదైన భూములను సొంతం చేసుకున్నట్లు హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు నమోదైన విషయం తెలిసిందే.