న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఇవాళ పదవ తరగతి పరీక్ష ఫలితాలను రిలీజ్ చేసింది. పదో తరగతిలో 93.6- శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతి తరహాలోనే టెన్త్లో కూడా అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కన్నా 2.04శాతం మంది అధికంగా అమ్మాయిలే పాసయ్యారు. పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలు 94.75 శాతం మంది పాసైనట్లు ప్రకటనలో తెలిపారు. సుమారు 47 వేల మంది విద్యార్థులు.. 95 శాతం కన్నా ఎక్కువ మార్కులను సాధించారు. సుమారు 2.12 లక్షల మంది 90 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాసయ్యారు. కంపార్ట్మెంట్లో 1.32 లక్షల మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇది గత ఏడాదితో పోలిస్తే కొద్దగా తగ్గినట్లు భావిస్తున్నారు.