Loksabha Elections 2024 : హర్యానా గవర్నర్, హైదరాబాద్ వాసి బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రాంనగర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చి సిరా గుర్తును చూపించారు.
తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దేశ భవితను మార్చేందుకు ఓటు హక్కు చాలా కీలకమైనదని అన్నారు. ఓటు మార్పుకు బాటలు వేస్తుందని, అందుకే ప్రజలంతా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
#WATCH | Bandaru Dattatraya says, “…I feel delighted to have cast my vote here. In democracy, the right to vote is very important. Votes bring change…So, people should vote in large numbers and strengthen democracy…I urge all voters to vote in large numbers…”… https://t.co/5fGQi26Uzo pic.twitter.com/XVYcG2qCGD
— ANI (@ANI) May 13, 2024
ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక లోక్‌సభ నాలుగో దశఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఇవాళ తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే 40 శాతం పోలింగ్ నమోదైంది.
Read More :
Loksabha Elections 2024 | బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణుల దాడి : ముగ్గురికి తీవ్రగాయాలు