చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్(CM Vijay) తన పుట్టిన రోజున కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ 22వ తేదీన ఆయన జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త తరహా రేషన్ కార్డులను అందివ్వనున్నారు. ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారుల ప్రకారం.. ఇప్పటికే సుమారు 46 వేల కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేశారు. వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 2.25 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలి దశలో 46 వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పెరంబదూర్‌లో జరిగిన బర్త్‌డే కార్యక్రమంలో సీఎం విజయ్ కొత్త రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. రాష్టవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించేందుకు టీవీకే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.