చెన్నై: ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సడెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బస్సు ఎక్కారు. బస్సులో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో బస్సు సౌకర్యాల గురించి మాట్లాడారు. ఇదంతా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ ఇలా ప్రభుత్వ బస్సులో ప్రత్యక్షం అయ్యారు. బస్సులో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేదా అని తనిఖీ చేశారు. ఆ తర్వాత బస్సులోని ప్రయాణికులతో మాట్లాడారు. బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
మహిళలకు ఇటీవల ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Watch | Tamil Nadu CM @mkstalin boards a bus in #Chennai, interacts with passengers pic.twitter.com/utt3GdyUlW
— The Indian Express (@IndianExpress) October 23, 2021