CM Revanth | న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించినట్లు సమాచారం. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
#WATCH | Telangana CM Revanth Reddy along with Deputy CM Bhatti Vikramarka Mallu arrives in Delhi pic.twitter.com/lHZwt4ez5d
— ANI (@ANI) December 26, 2023