పనాజీ: గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) ప్రకటించారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వలేదు. అయినప్పటికీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని సావంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, మరో 16 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
కాగా, సీఎం సావంత్ సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజలకే చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
గోవాలో శివసేన, టీఎంసీ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్తో జతకడితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది.
#WATCH "The credit for this win goes to the party workers…BJP will form the govt in Goa," says Goa CM Pramod Sawant#GoaElections2022 pic.twitter.com/dVGPvnNidh
— ANI (@ANI) March 10, 2022