బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఇటీవలే తన 40వ పుట్టినరోజు జరుపుకొన్నది. ఆ వయసులోనూ ఆ అందం, ఫిట్నెస్ చూసి.. దీపిక నలభై పడిలో పడిందంటే నమ్మడం కష్టమే. తన పుట్టినరోజు సందర్భంగా ఫిట్నెస్ సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అత్యంత క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, ఆహారపు అలవాట్లే తనను ఇప్పటికీ వెండితెరపై మెరిసేలా చేస్తున్నాయని చెప్పుకొచ్చింది.
“నేను ఎప్పటినుంచో సమతుల ఆహారాన్ని అనుసరిస్తున్నాను. ఇది నాకు కేవలం డైట్ మాత్రమే కాదు, నా జీవనశైలి కూడా ప్రధాన కారణం” అని పేర్కొన్నది. సెలెబ్రిటీలు అసలు ఏమీ తినరని కేవలం సలాడ్ల మీదనే బతుకుతారనే అపోహపై ఆమె స్పందిస్తూ “నేను చాలా బాగా తింటాను” అంటూ తనకిష్టమైన స్వీట్లు, ఇతర పదార్థాల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. మితంగా తినడంతోపాటు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం తన ఫిట్నెస్ ఫార్ములా అంటున్నది దీపిక.
“కేవలం జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేసినంత మాత్రాన ఫిట్నెస్ రాదు. మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాసనాలు సాధన చేస్తాను” అని వెల్లడించింది. విపరీత కరణి అనే యోగాసనాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది దీపిక. సెల్ఫ్‌కేర్ ఏదో ఓ సందర్భంలో తీసుకుంటే సరిపోదని, దాన్ని అనునిత్యం
కొనసాగించాలంటూ చెప్పుకొచ్చింది.