యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అందించిన విజయం అని ఎద్దేవా చేశారు. ఎన్నికల పరికరాలు, కేంద్ర బలగాలను వాడుకున్నారు. కొన్ని రాష్ట్రాలను గెలుచుకున్నారు. ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్లు డప్పులు వాయించుకుంటున్నారు. కానీ సౌండ్ లేదు. అంటూ మమత ఎద్దేవా చేశారు.
యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని అంటున్నారు కానీ.. జాగ్రత్తగా గమనిస్తే సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఓట్ల శాతం పెరిగిందని మమతా అన్నారు. అఖిలేశ్‌కు సీట్లు పెరిగాయని, బీజేపీకి సీట్లు తగ్గాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, అధికారులను కూడా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఈ కారణంగానే అఖిలేశ్ కాస్త నష్టపోయారని, ఈ నష్టంతో అఖిలేశ్ బాధపడాల్సిన పనిలేదని మమత అన్నారు. తిరిగి ప్రజల్లోకి వెళ్లి, ఈవీఎంలపై ఫోరెన్సిక్ అధ్యయనం చేయాలని డిమాండ్ చేయాలని మమత సూచించారు.