హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి కృషి చేసే అంశంపై అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలో చర్చిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వ పెత్తనం పెరిగిందని, రాష్ట్రాల హకులను హరిస్తున్నందునే సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ గళమెత్తారని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ పోర్ట్ ద్వారానే దేశానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పటికీ ఆ పార్టీ ‘కొంప’నే బాగాలేదని, రాష్ట్రంలో కూడా ఆ పార్టీ నేతలే చెడగొట్టుకుంటున్నారని పేరొన్నారు. వివిధ రాష్ర్టాల్లోని బీజేపీయేతర అధికార పార్టీలతో తమకు రాజకీయ స్నేహం ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యల పరిషారానికి పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. గిరిజన హకులను హరించేందుకు ప్రయత్నిస్తున్న మోదీ ‘నంబర్ వన్ క్రిమినల్’ అని మండిపడ్డారు.