న్యూఢిల్లీ : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. స్టాలిన్‌కు ఫోన్ చేసి బర్త్ విషెష్ చెప్పారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.