హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించనున్నట్లు సమాచారం.
కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.
Read also : Telugu news | Telangana news | Telugu cinema news | Sports news | Business news | Latest news in Telugu | Hyderabad news | Health news in Telugu